రెండు రోజులు ఏడు నియోజకవర్గాలు 32 క్లస్టర్స్* *పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల మహానాడు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ చిన్ని*వర్చువల్ మహానాడు కార్యక్రమానికి సైతం తెలుగు తమ్ముళ్లు బ్రహ్మరథం*

విజయవాడ( పార్లమెంట్) విజయవాడ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విస్తృతంగా రెండు రోజులు పర్యటించారు రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో ఏకంగా 32 క్లస్టర్ ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు లో పాల్గొని ఆయన ప్రసంగించారు ముందుగా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి వన్ సెంటర్ నందు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం పలు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన వర్చువల్ మహానాడులో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అనంతరం పలు నియోజకవర్గాల్లో సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిందని అన్నారు మహానాడు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగిందని ఎక్కడ చూసినా పసుపు కండువాలతో ప్రాంతాలన్నీ కళకళలాడాయని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పార్టీ అన్ని విధాల దినదినభివృద్ధి చెందుతుందని ఎంపీ తెలిపారు.
ముందుగా నందిగామ నియోజకవర్గంలో ఎంపీ చిన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నియోజకవర్గ పరిశీలకులు మరియు క్లస్టర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వర్చువల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటి సభ్యత్వాలు కలిగిన టిడిపి పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి తగినటువంటి పదవి ఇచ్చి గౌరవించుకుంటుందని తెలిపారు ప్రాంతీయ పార్టీలన్నిటిలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కార్యకర్తల అండతో ముందుకు కొనసాగిందని రాష్ట్రవ్యాప్తంగా టిడిపి పార్టీకి ఉన్న బలం కేడర్ మాత్రమేనని ఎంపీ అన్నారు
జగ్గయ్యపేట నియోజకవర్గం లోని పెనుగంచిప్రోలు గరుడాచలం ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఎంపీ చిన్ని ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్భంగా మహానాడు ఇంత అత్యంత వైభవంగా జరగడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కార్యకర్తలందరూ క్రమశిక్షణతో మహానాడు కార్యక్రమంలో పాల్గొనడంతో ఎంపీ చిన్ని కార్యకర్తలు ఉత్సాహాన్ని ఆయన చరవాణిలో సెల్ఫీ వీడియో మరియు ఫోటోలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన వైపు అడుగులు వేస్తుందని నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు అటు పార్టీలోనూ కేడర్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీకి నాయకులు ఎంత మంది వచ్చినా శాశ్వతంగా ఉండేది కార్యకర్తలేనని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు
తిరువూరు నియోజకవర్గం లోని ఊటుకూరు తోటమూల గంపలగూడెం తిరువూరు టౌన్ గోపాలపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమాల్లో ఎంపీ చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గం తనకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం తన రాజకీయ ప్రచారం ప్రారంభించింది మొదటిగా తిరువూరు ప్రాంతం నుండే అని అన్నారు తిరువూరు నియోజకవర్గ టిడిపి నాయకులు కేడర్ని తాను ఎన్నటికీ మరువలేనని తన విజయంలో వారి పాత్ర మరువలేనిదని ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు విజయాలను తిరువూరు కేడర్ పనిచేసిన తీరు అద్భుతం అని అన్నారు నాయకులు ఉన్నా లేకున్నా మొట్టమొదటి నుంచి పార్టీకి అండగా నిలిచింది టిడిపి కార్యకర్తలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ప్రజాప్రతినిధులకు చెబుతూనే ఉంటారని అన్నారు రెండు రోజుల పసుపు పండుగను విజయవాడ పార్లమెంట్ పరిధిలో లోని ఏడు నియోజకవర్గాల్లో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎంపీ చిన్ని పేరుపేరునా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు