ఎరువుల గోడౌన్, అక్రమ రోడ్డు నిర్మాణంపై కలెక్టర్‌కు నేలకొండపల్లి వాసి ఫిర్యాదు

ఖమ్మం (నమస్తే ) నేలకొండ పల్లి నేలకొండపల్లి గ్రామంలో ఇంటి ముందు అనధి కారికంగా ఎరువుల గోడౌన్ నిర్మించడంతో పాటు ఆ గోడౌన్ ఎత్తుకు సరిపడా రాత్రికి రాత్రే రోడ్డుకు మట్టి పోసి ఎత్తు పెంచారని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.ఫిర్యాదు సారాంశం
నేలకొండపల్లి గ్రామం సింగారె డ్డిపాలెంకు చెందిన నంవర్ల దేవీ ప్రసాద్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కూసుమంచి రోడ్డులో తమ ఇంటి ముందు భాగంలో జి. రామారావు అనధికారికంగా ఎరువుల షాప్ గోడౌన్‌ను చాలా ఎత్తులో కొత్తగా నిర్మించాడని తెలిపారు.
అంతేకాకుండా ఆ గోడౌన్ ఎత్తుకు సరిపడే విధంగా రోడ్డుపై కూడా దౌర్జన్యంగా మట్టి పోసి ఎత్తు పెంచారని, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే సీసీ రోడ్డు వేయించేందుకు ప్రయ త్నిస్తున్నారని ఆరోపించారు.
పంచాయతీ పెద్దల అండ దండలు జి. రామారావు లింగం ఎల్లమంద ఇద్దరూ కలిసి అక్రమంగా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని వారి వ్యాపార సౌలభ్యం కోసం పంచాయతీ పెద్దల అండదండలతో ఈ పనులు జరుగుతున్నాయని తమకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.వర్షాకాలం భయం ప్రస్తుతం కూసుమంచి మెయిన్ రోడ్డుకంటే చాలా ఎత్తుగా మట్టి పోయడంతో తమ ఇల్లు కింద స్థాయిలోకి వెళ్లిపోయిందని వర్షాకాలంలో నీరు నేరుగా ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని దేవీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల గోడౌన్ వల్ల దుర్వాసన ఇళ్ల మధ్యకు వస్తోందని కూడా తెలిపారు.
డిమాండ్లు:1. మెయిన్ రోడ్డును కల్వర్టు స్థాయికి సమాంతరంగా లెవల్ చేయాలి 2. అనధికార ఎరువుల గోడౌన్‌ను అక్కడి నుంచి తొలగించాలి 3. సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి