గంజాయి ఉపయోగించి ఉపయోగించేవారు ఉన్నా సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియ జేయాలని కోరారు.

చిలుకూరు పోలీస్ స్టేషన్
గంజాయి నిర్మూల లక్ష్యంగా నార్కోటి డాగ్ రోలెక్స్ తనిఖీలు

సూర్యాపేట (నమస్తే )జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది చిలుకూరు మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు అని ఎస్సై హనుమాన్ నాయక్ తెలిపారు. గాంజా లాంటి మాదకద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో మండల కేంద్రంలో హోటల్స్ టీ దుకాణాలు మెడికల్ దుకాణాలు కూరగాయల దుకాణాలు బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు సోదాలు నిర్వహించామని అన్నారు. ప్రస్తుత సమాజంలో గాంజాయి లాంటి మాద కద్రవ్యం మన యువతని సమాజాన్ని పట్టిపీడిస్తుందని దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉండాలని అన్నారు. దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వ హించామని డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి ఉపయోగించి ఉపయోగించేవారు ఉన్నా సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియ జేయాలని కోరారు.