బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులో కాపు సామాజికవర్గానికి చెందిన బాధితులను కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ పరామర్శించారు.
భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఉప్పు జానకిరామయ్య, రాము బాలు, రాము నారాయణ, రాము వెంకటలక్ష్మీలను ఆయన కలిసి ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.వేమూరు సర్కిల్ ఇస్పెక్టర్(సి.ఐ) కొల్లూరు.భట్టిప్రోలు యస్.ఐలనుకలసి ఘటనకుసంబందించినపూర్తివివరాలనుఅడిగితెలుసుకొన్నారు.
చందు జనార్ధన్ వెంట,బశెట్టి ప్రసాద్, ఓతుకోలు మార్కండేయులు, అరవ హరిబాబు, బొందలపాటి చలమయ్య, బి వెంకటరామయ్య, తాడిశెట్టి బాలాజీ, మత్తి నాగరాజు, సనకా శివయ్య, ఉప్పు భాస్కర్, రవితేజ, కంకణాల రవి తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని చందు జనార్ధన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.