ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనవసర కాన్వాయిలు మరియు ఆర్భాటాలను తగ్గించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు స్పందించారు._

*పెనుగంచిప్రోలు నుండి అనిగండ్లపాడు వరకు సైకిల్ యాత్ర చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు*

_జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలతో మరింత చేరువ కావడంతో పాటు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ఈరోజు ప్రత్యేకంగా సైకిల్ యాత్ర నిర్వహించారు._

_భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు వారంలో ఒకటి లేదా రెండు రోజులు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తూ ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనవసర కాన్వాయిలు మరియు ఆర్భాటాలను తగ్గించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు స్పందించారు._

_ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం నుండి ఆర్టీసీ బస్సులో పెనుగంచిప్రోలు వరకు ప్రయాణించిన ఎమ్మెల్యే గారు, అనంతరం పెనుగంచిప్రోలు గ్రామం నుండి అనిగండ్లపాడు గ్రామానికి స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి అక్కడ నిర్వహించిన ప్రజా దర్బార్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు._

_గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ప్రజలతో కలిసి సాధారణ జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు._

_ఈ కార్యక్రమంలో చింతల సీతారామయ్య, కొఠారు సత్యనారాయణ ప్రసాద్, కళ్యాణం కృష్ణారావు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు._