జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు చేస్తున్న కార్మికులకు కోగంటి బాబు శుక్రవారం పంపిణీ చేశారు .

నమస్తే, శ్రీ తేజ న్యూస్, కంచికచర్ల: గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల వారికి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఎంతగానో దోహద పడతాయని స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు పేర్కొన్నారు. కంచికచర్ల పట్టణ పరిధిలోని మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్ మండల టిడిపి అధ్యక్షులు కోగంటి బాబు పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు చేస్తున్న కార్మికులకు కోగంటి బాబు శుక్రవారం పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు మాట్లాడుతూ.. పేద, మధ్య, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు వేసవి తరుణంలో పనులు కల్పించాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు.ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్ గా నమోదు కాబడి ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజులు పాటు ఉపాధి కల్పించడం జరుగు తుందన్నారు. అందుకు ప్రతి ఒక్కరు జాతీయ గ్రామీణ ఉపాధి పనులను సద్వినియోగ పర్చు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రమాదేవి, సీనియర్ టిడిపి నాయకులు గుర్రం రామకృష్ణ, మాజీ వార్డు మెంబర్ గూడవల్లి గణేష్, ఎస్సీ సెల్ నాయకులు నకరికంటి ఏసోబు తదితరులు పాల్గొన్నారు.