విచారణ చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సి.హెచ్. సుధాకర్ డిమాండ్ చేశారు.

నమస్తే-శ్రీ తేజ న్యూస్,మైలవరం:*

*ఉపాధి హామీ నిధులు స్వాహా పై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సి.హెచ్. సుధాకర్ డిమాండ్ చేశారు.స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం పై ఆధారాలు చూపిస్తూ ఆయన గురువారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఎం బృందం ఇటీవల పర్యటించిందన్నారు. ఈ పర్యటనలో గణపవరం,మైలవరం లోని చిన్న హరిజనవాడ క్లస్టర్ల లో భారీగా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వజ్రాల వెంకటరెడ్డి, రావుల సుబ్బారావు, లంక వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.*