అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు
పెనమలూరు నియోజకవర్గంలో తనకు మద్దతుగా అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీని వైసీపీ నేతలు కావాలనే నిరసన కార్యక్రమంగా చిత్రీకరిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు.
వైసీపీ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేయడంతో సంతోషించిన అంగన్వాడీలు తన పర్యటన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. ఈ కృతజ్ఞత ర్యాలీని నిరసనగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి లోకేశ్ తన ‘ఎక్స్’ పోస్టులో ఆరోపించారు.