అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి.. ‘మీ మార్ట్’ కాన్సెప్ట్‌తో రేషన్ దుకాణాల్లో కొత్త సేవలు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా ‘మీ మార్ట్’ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నట్లు, రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు.
ధాన్యం రవాణా, నిల్వల పర్యవేక్షణ కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికతను అమలు చేస్తున్నామని, డిజిటల్ వాలెట్ విధానం ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.