సీఎంలపై క్రిమినల్ కేసులు.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు నమోదై ఉండటంతో ఆయన ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిపై 29 కేసులు ఉండగా, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై 19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా 19 కేసులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

ఇక ఇద్దరు ముఖ్యమంత్రులపై హత్యాయత్నం కేసులు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వయస్సు పరంగా చూస్తే 31 మంది ముఖ్యమంత్రుల్లో 17 మంది 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారు కాగా, 8 మంది 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిగా నివేదిక వెల్లడించింది.