శివాని సూసైడ్ నోట్‌లో కుటుంబానికి సందేశం.. కుటుంబ కలహాల కోణంలో పోలీసుల విచారణ
రంపచోడవరం విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య కేసులో పోలీసులు కుటుంబ కలహాల కోణంలో కూడా విచారణ చేపట్టారు. శివాని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.
శివాని తన సూసైడ్ నోట్‌లో "అమ్మ, అన్నయ్య, వదిన, అమ్మమ్మ ఎప్పటికైనా కలవండి.. ద్వేషించుకోకండి" అని రాయడం దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ సందేశం వెనుక ఉన్న కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో శివాని సెల్‌ఫోన్‌లోని కాల్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.