ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు, సంగీతం, నృత్య ప్రదర్శనలకు కొత్త గౌరవ వేతనాలు అమల్లోకి

టీటీడీ బోర్డు ఆమోదించిన తాజా నిర్ణయాల ప్రకారం ధార్మిక ఉపన్యాసాలు, పురాణ ప్రవచనాలు చెప్పే పండితులకు రోజుకు రూ.3 వేల నుంచి రూ.6,500 వరకు సంభావన అందనుంది. అనుగ్రహ భాషణం చేసే స్వామీజీలకు రోజుకు రూ.10,116 నుంచి రూ.15,116 వరకు చెల్లించనున్నారు.

ప్రత్యేక సదస్సుల్లో పాల్గొనే పండితులు, ధనుర్మాసం తిరుప్పావై పారాయణదారులు, విశ్వశాంతి యజ్ఞాల్లో పాల్గొనే రుత్వికులు, హరికథ, సంగీతం, బుర్రకథ, ఒగ్గుకథ కళాకారులకు కూడా గౌరవ వేతనాలను గణనీయంగా పెంచారు. అలాగే సంగీత, నృత్య బృందాలను గ్రేడ్ల వారీగా విభజించి రూ.6 వేల నుంచి రూ.35 వేల వరకు పారితోషికాలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో టీటీడీ ఆధ్వర్యంలో సేవలందించే కళాకారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.