బీబీపేట నాలుగు జిల్లాల కూడలి కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల,మెదక్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ప్రమాదకరంగా ఉన్న వంతెన పై నిర్లక్ష్యం...

బీబీపేట్....
గత వర్షాకాలంలో కూలిన వంతెన రోడ్డుని మళ్లీ వర్షాకాలం వచ్చినప్పటికీ నూతన వంతెన ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ మార్గంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.రాత్రి వేళలో చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు, మరియు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు.
ప్రభుత్వాల పట్ల ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. బీబీపేట నాలుగు జిల్లాల కూడలి కామారెడ్డి,సిద్దిపేట,సిరిసిల్ల,మెదక్ వీళ్లు అందరూ ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నారని ఇలాంటి ప్రధాన మార్గంలో ఉన్న సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మ మచ్చేందర్ కోరారు.