అవార్డును స్వీకరించిన సందర్భంగా గురువారం తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో డా. రమేష్ కు సత్కార కార్యక్రమం నిర్వహించారు

నమస్తే ,శ్రీ తేజ న్యూస్,తిరువూరు:-- తిరువూరు సరిహద్దు తెలంగాణ లోని కల్లూరు పట్టణం లోని ప్రాంతీయ వైద్యశాలలో సర్జన్‌గా సేవలందిస్తున్న, తిరువూరు ఎంవీఎస్ హాస్పిటల్ వైద్యులు డా. రమేష్ వైద్య రంగంలో విశేష సేవలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య మరియు డాక్టర్ సాజిదా ఖాన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన సందర్భంగా గురువారం తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో డా. రమేష్ కు సత్కార కార్యక్రమం నిర్వహించారు .ఎమ్మెల్యే కొలికపూడి ఆయనను మర్యాదపూర్వకంగా కార్యాలయం లోకి ఆహ్వానించి, పూల బొకే అందజేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వెనుకబడిన తిరువూరు ప్రాంతానికి ఎంతో గర్వకారణమని అన్నారు . డా. రమేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏం వి ఎస్ హాస్పిటల్ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు