విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, విద్యార్థుల మానసిక స్థితి గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలి* *విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలి* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*

విద్య ద్వారా పేదలు సాధికారత సాధించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం*

*కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యా బోధనా, సౌకర్యాలు*

*పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలి*

*100 డేస్ యాక్షన్ ప్లాన్, ముస్తాబు ప్రతి పాఠశాలలో కచ్చితంగా అమలు చేయాలి*

*అంబేద్కర్ గురుకులాల డీసీవోలు, ప్రిన్సిపాళ్లకు నిర్వహించిన వర్క్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డా. స్వామి*

*అమరావతి / విజయవాడ, జూన్ 11 :*

విద్య ద్వారా పేదలు సాధికారత సాధించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విజయవాడలోని వి.ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో అంబేద్కర్ గురుకులాల డీసీవోలు, ప్రిన్సిపాళ్లు, సోషల్ వెల్ఫేర్ డీడీలు, ఏఎస్ డబ్ల్యూవో లకు నిర్వహించిన వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా మంత్రి డా.స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...విద్య ద్వారా పేదలు సాధికారత సాధించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు విద్యా బోధనా, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేయాలి. 100 డేస్ యాక్షన్ ప్లాన్, ముస్తాబు కార్యక్రమం ప్రతి పాఠశాలలో కచ్చితంగా అమలు చేయాలి. మరుగుదొడ్లు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక ఉపాధ్యాయులు, సిబ్బంది శ్రద్ధ పెట్టాలి, విద్యార్థుల మానసిక స్థితి గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించడంతో పాటు వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 10 కి పెంచాం. ఈ ఏడాది మరో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం. ఐఐటి, నీట్ లో ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించేలా కృషి చేయాలి. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేశాం. ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ లో పారిశుద్ధ్యం, సౌకర్యాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో 100 శాతం సంతృప్తి రావాలి. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, పేదల విద్య కోసం కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల సంస్థ కార్యదర్శి ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ బి. లావణ్య వేణి, అడిషనల్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.