శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా నూతన మున్సిపల్ కమిషనర్ శ్రీ P.V.V.D. ప్రసాద్ కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ గంగాపురం రాఘవేంద్ర కలవటం జరిగింది.
జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలు ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, శ్రీరాం కృష్ణ నిహార్, కాంట్రాక్టర్ కాకులపాటి కృష్ణమోహన్, మేనేజర్ కృష్ణ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.