నందిగామ జూన్ 9 నమస్తే శ్రీ తేజ
నందిగామ పట్టణంలో ఇంకుడు గుంటలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాల్ పోస్టర్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు.అపార్ట్‌మెంట్ల వద్దకు వెళ్లి పోస్టర్లు అంటించి జల చైతన్య సందేశం అందించారు. నందిగామ పట్టణంలో భూగర్భ జలాల పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రూపొందించిన "ప్రతి అపార్ట్‌మెంట్‌కు – ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంట" జల చైతన్య కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వాల్ పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు.రైతుపేటలోని కాకతీయ స్కూల్ నూతన భవన ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుల సమక్షంలో ఈ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రజల్లో జల సంరక్షణపై చైతన్యం కలిగించే విధంగా పోస్టర్ రూపకల్పన చేసి అందించిన కత్తురోజు శ్రీనివాసాచారి ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రైతుపేట పరిసర ప్రాంతాల్లోని పలు అపార్ట్‌మెంట్లను సందర్శించి, ఆయా అపార్ట్‌మెంట్ల ఆవరణల్లో స్వయంగా అవగాహన పోస్టర్లను అంటించి, అపార్ట్‌మెంట్ యజమానులు మరియు నివాసితులతో ముఖాముఖి మాట్లాడారు.పట్టణ విస్తరణ, పెరుగుతున్న జనాభా, భూగర్భ జలాల పరిరక్షణ అవసరాన్ని వివరిస్తూ ప్రతి అపార్ట్‌మెంట్‌లో తప్పనిసరిగా ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వర్షపు నీటిని భూమిలోకి పంపడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా
ప్రజలకు ఎమ్మెల్యే సందేశం ఇచ్చారు.💧 భూమి నుంచి నీరు తీసుకుంటున్నాం... తిరిగి భూమికి నీరు ఇవ్వాలి.💧 ఇంకుడు గుంట నేడు... నీటి భద్రత రేపు.💧 వర్షపు చుక్కను కాపాడితే... భవిష్యత్ తరాలకు జలసంపదను అందించినట్టే.💧 ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇంకుడు గుంట... ప్రతి కుటుంబానికి నీటి భరోసా."హరిత నందిగామ – జలసమృద్ధి నందిగామ" లక్ష్య సాధనలో ప్రతి కుటుంబం, ప్రతి అపార్ట్‌మెంట్ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.