శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం టౌన్
9/6/25...
శ్రీకాకుళం జిల్లా,శ్రీకాకుళం పట్టణం లోని గ్రాండ్ కన్వెన్షన్ కాన్ఫిరెన్స్ హాల్ లో 8,9 వ తేదీలలో రెండు రోజుల పాటు జాతీయ పంచాయితీ రాజ్ ఛాంబర్ సమావేశాలు జాతీయ అధ్యక్షులు శ్రీ వై.వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్)రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు
రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా ఏర్పాటు చేసి గ్రామ పంచాయితీ,మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ లకు నిధులు,విధులు అధికారాలు మరియు సిబ్బందిని సంపూర్ణంగా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి
ఉద్యమ కార్యాచరణ రూపొందించి పలు తీర్మానాలు చేయడం జరిగింది.
తీర్మానాలు
(1)శాసనమండలి ఎన్నికలలో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్
చేస్తూ సమావేశం తీర్మానించడం అయినది.
(2)మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ సమావేశాలలో తీర్మానం చేసే సందర్భంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కు మండల పరిషత్ లలో, మండల అధ్యక్షునికి జిల్లా పరిషత్ లలో ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించడమైనది.
(3)తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల తో పాటు ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేసి సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ వుండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించడమైనది.
(4) 73,74 వ రాజ్యాంగ సవరణ లోని ఆర్టికల్ 243 జి 11 వ షెడ్యూల్ లో పేర్కొన్న 29 అంశాలు 12 వ షెడ్యూల్ లో పేర్కొన్న 18 అంశాలను ,నిధులు విధులు అధికారాలు మరియు సిబ్బంది తో సహా స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ,మండల పరిషత్,జిల్లా పరిషత్ లకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తప్పనిసరిగా బదిలీ చేసే విధంగా స్పష్టమైన నిబంధన పెట్టి పార్లమెంటులో మళ్లీ రాజ్యాంగ సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించడం అయినది.
(5)స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధి అయి ఉండాలి అని ఖచ్చితమైన నిబంధన పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానిచడమైనది m
(6) పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ లో పని చేసే ఉద్యోగి స్థానిక పరిధిలోని వోటర్ అయి వుండకూడదు అనే నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించడమైనది.
(7) స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వారి పదవీ కాలం పూర్తి అయిన తరువాత ఎమ్మెల్యే,ఎంపీ ల మాదిరి పింక్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించడమైనది.
(8) సమావేశం తీర్మానించిన డిమాండ్ల సాధనకు జాతీయ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల పంచాయితీ రాజ్ ఛాంబర్ నాయకులు రాజకీయాలకతీతంగా రాజీ లేని పోరాటాన్ని కొనసాగించాలని సమావేశం తీర్మానించడైనది.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి(కర్నూలు జిల్లా)తెలంగాణ పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుస్కూరు అశోక్ రావు (కరీంనగర్ జిల్లా)సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి (విశాఖ జిల్లా)ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు(శ్రీకాకుళం జిల్లా)వై.వినోద్ రాజు (అనకాపల్లి జిల్లా )వానపల్లి ముత్యాల రావు (విశాఖ జిల్లా)కొత్తపు ముని రెడ్డి(కడప జిల్లా)సింగం శెట్టి సుబ్బ రామయ్య(కడప జిల్లా)గోగినేని వసుధ (గుంటూరు జిల్లా)సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ (ఒంగోలు)గౌరవ సలహాదారు వీరభద్ర ఆచారి(ఒంగోలు)చిత్తూరు ,శ్రీకాకుళం జిల్లా ల పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్(చిత్తూరు)భానోజీ నాయుడు (శ్రీ కాకుళం)అనంతపురం ,విశాఖ ,పచ్చిమ ,తూర్పు గోదావరి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు(అనకాపల్లి)వెంగమ నాయుడు (అనంతపురం)లక్ష్మణ్ రావు (పశ్చిమ గోదావరి)ఎన్వీ సుబ్బా రావు (కోన సీమ జిల్లా)సర్పంచుల సంఘం మరియు పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్(అనంతపురం),గోపి రెడ్డి వెంకటేష్ (నెల్లూరు)నాగేంద్ర రెడ్డి (నెల్లూరు)యలవర్తి లక్ష్మి (బాపట్ల జిల్లా)బుచ్చిరాజు (కోన సీమ)ప్రసాద్ (తూర్పు గోదావరి జిల్లా)రౌతు శ్రీనివాస్ (శ్రీకాకుళం జిల్లా)తదితరులు పాల్గొన్నారు