పెనుగంచిప్రోలు మండలంలోని రైతులకు నూతన పాసుపుస్తకాల పంపిణీకి ప్రత్యేకంగా కృషి చేస్తానని... రెవెన్యూపరమైన సమస్యలన్నింటినీ సకాలంలో పరిష్కరిస్తానని అన్నారు.

పెనుగంచిప్రోలు....
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం (ఫుల్ అడిషనల్) తాసిల్దార్ గా రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు.వారు నందిగామ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి వచ్చిన విషయం తెలిసిందే.