వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని, పారిశ్రామిక వాడల నుండి వెలువడే వ్యర్ధాలను అరికట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

*నమస్తే-శ్రీ తేజ న్యూస్,మైలవరం:*
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు మాట్లాడుతూ చెట్లను,అడవులను నరకడం వల్ల పచ్చని సమతుల్య వాతావరణం లేకుండా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వాపోయారు.ప్రతి ఒక్కరు విధిగా మొక్కలను పెంచి రాబోయే రోజుల్లో ఆకుపచ్చని పసిడి ఆంధ్రప్రదేశ్ కు కృషి చేయాలన్నారు. వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని, పారిశ్రామిక వాడల నుండి వెలువడే వ్యర్ధాలను అరికట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.వైస్ ప్రిన్సిపల్ డా.బి.రమేష్ రెడ్డి మాట్లాడుతూ మన భవిష్యత్తును సంరక్షించాలంటే ప్రకృతి పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి,వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. యన్.యస్.యస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బి.శివహరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణంలో విపరీతంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని,రాబోయే రోజుల్లో మానవ మనుగడకు, జీవ రాశులకు పెనుముప్పు కాకుండా పచ్చదనాన్ని బాగా పెంచాలని,ప్లాస్టిక్ వినియోగాన్ని,వ్యర్ధ పదార్ధాలను,నీటి, వాహన,ధ్వని కాలుష్యాలను నియంత్రించి ఓజోన్ పోర పరిరక్షణకు తోడ్పడాలని తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో పలు మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగాధిపతి డా.యం.బి.ఎస్.శ్రీఖర రెడ్డి,యస్.ఉమా మహేశ్వర రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.*