అమరావతి/ తిరువనంతపురం : రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల కేరళం పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, అద్భుతమైన గమ్యస్థాన బ్రాండింగ్‌లో చూపిన ప్రతిభకు గాను
ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక 'బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్' అవార్డును తిరువనంతపురంలో అందించినందుకు గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026 నిర్వాహకులకు, కేరళం ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. బాధ్యతాయుత పర్యాటక విధానాల్లో కేరళ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మరియు మాజీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్, తిరువనంతపురం మేయర్ వి. వి. రాజేష్, జీటీఎం సీఈఓ శ్రీ సిజి నాయర్, సౌత్ కేరళ హోటలియర్స్ ఫోరం కార్యదర్శి ప్రసాద్ మంజలి లు అవార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మంత్రి కందుల దుర్గేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కేరళం పర్యాటక సర్క్యూట్లతో పాటు ఆయుర్వేద ప్రాజెక్టుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం ముంబై పర్యటనకు బయలుదేరారు..