ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల తాసిల్దారుగా శ్రీమతి ఎస్ శిరీష బాధ్యతలు స్వీకరించారు,
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల తాసిల్దార్ గా శ్రీమతి ఎస్ శిరీష శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. సుమారు 20 నెలలపాటు ఇంచార్జ్ పాలనలో జగ్గయ్యపేట మండల రెవెన్యూ కార్యాలయం కొనసాగటం జరిగింది. ఇక్కడ అనేక అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకోవడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రత్యేక దృష్టి సారించి సమర్థత కలిగిన శ్రీమతి శిరీష ను తాసిల్దారుగా నియమించారు. అనంతరం కార్యాలయ ఉద్యోగులు మరియు విఆర్వోలు తాసిల్దార్ శిరీష కు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు,