తెలంగాణ ప్రాంతానికి ఎరువులు పురుగు మందులను అక్రమంగా తరలిస్తూ ఈ ప్రాంతంలోని రైతాంగానికి వరసన సృష్టిస్తున్నారని దీనిపై విచారణ చేపట్టారు.
నమస్తే,శ్రీ తేజ న్యూస్ ,తిరువూరు:-- తిరువూరు పట్టణంలో ఎరువులు మరియు పురుగు మందుల దుకాణాలను రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ.కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా,డిఏపి ఇతర ఎరువులు తెలంగాణకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఏ పి ఏ ఐ ఎం ఎస్ యాప్ ద్వారానే రైతులకు కావాల్సిన మేరకు యూరియా అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారిణి పి పద్మ, ఎస్సై శాతకర్ణి,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.