_ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం_
_04-06-2026 గురువారం_
వత్సవాయి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సందర్భంగా వత్సవాయి మండల పార్టీ అధ్యక్షుడు గుత్తా శంకర్రావు గారి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు_,
_ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు._
_ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేశారని విమర్శించారు.._
_రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తూ, సామాన్య ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.._
_ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం, పెరుగుతున్న ప్రజా సమస్యలను నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వత్సవాయి తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూ తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
_ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యేసుపోగు దేవమణి-శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మెట్టుకోలు నరేష్, జిల్లా కార్యదర్శి ధరావత్ రుప్లానాయక్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కుక్కల శ్రీధర్, నియోజకవర్గ రైతు, ముస్లిం మైనార్టీ, యువజన విభాగాల అధ్యక్షులు షేక్ రన్ హుస్సేన్, కనగాల రమేష్, నరమనేని వెంకటేష్, మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.