_వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామంటూ మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం._

*_హామీలు అమలపై గళమెత్తిన ప్రజాదళం_*

_ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట...

_జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారి సూచన మేరకు జగ్గయ్యపేట మండల స్థాయిలో చంద్రబాబు వెన్నుపోటు కి రెండేళ్లు గడిచిన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలపై ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకు నిరసనగా ఈరోజు చిల్లకల్లు ఎస్సీ కాలనీ వైఎస్ఆర్ విగ్రహం నుంచి జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు గారి ఆధ్వర్యంలో మండల నాయకులు ప్రజలు కార్యకర్తలతో కలిసి నిర్వహించడం జరిగింది._

_మండల పరిషత్ కార్యాలయం నందు మండల ఇన్చార్జ్ ఎంపీడీవో గారికి వినతిపత్రాలు రూపంలో అమలు చేయాలని అందజేయడం జరిగింది._

_మోసపూరిత హామీలతో ఇచ్చిన బాండ్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు._
_రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇస్తానని మాటల చెప్పి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం._
_సూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలులో చెప్పిన చంద్రబాబు గద్దెనెక్కాక మాట మరిచారు._

_కరోనా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని గుర్తు చేశారు._

_ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు._