షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు సంబంధించిన రిజర్వేషన్ విధానం అమలు, రక్షణ చర్యలు మరియు సంక్షేమ కార్యక్రమాలపై విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (ఎన్‌సీఎస్టీ) గౌరవ ఛైర్మన్ శ్రీ అంతర్ సింగ్ ఆర్యా మరియు కమిషన్ గౌరవ సభ్యులు పోర్ట్ అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు.

విశాఖపట్నం పోర్ట్ లో ఎస్టీ రిజర్వేషన్ విధానం అమలుపై ఎన్‌సీఎస్టీ సమీక్ష

ఈ సందర్భంగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం మరియు రిజర్వేషన్ విధానం సమర్థవంతమైన అమలుకు పోర్ట్ చేపడుతున్న చర్యలు, కార్యక్రమాలపై పోర్ట్ అధికారులు ప్రెసెంటేషన్ ద్వారా కమిషన్ కు వివరించారు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ జస్మీత్ సింగ్ బింద్రా, ఐఆర్టీఎస్, కార్యదర్శి శ్రీ ఎం. శంకర్ బాబు, ఎస్సీ/ఎస్టీ అధికారుల మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు శ్రీ ఉమా మహేశ్వరరావు, శ్రీ దేవేశ్వరరావు, శ్రీ రామకృష్ణ, శ్రీ ఓ. రామలింగం మరియు లైజన్ అధికారి శ్రీ బి. సాంబమూర్తి సమావేశంలో పాల్గొని, రిజర్వేషన్ విధానం అమలు మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంక్షేమానికి సంబంధించి పోర్ట్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎన్‌సీఎస్టీ గౌరవ ఛైర్మన్ మరియు సభ్యులు, ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం, సంక్షేమ చర్యలు మరియు రిజర్వేషన్ విధానం అమలులో పోర్ట్ తో పాటు ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘాలు చేస్తున్న కృషిని అభినందించారు.
షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు సంబంధించిన రిజర్వేషన్ విధానం అమలు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, పారదర్శకత మరియు భారత ప్రభుత్వ మార్గదర్శకాల అమలులో పోర్ట్ చేపడుతున్న కార్యక్రమాలు పోర్ట్ నిబద్ధతకు అడ్డంపడుతున్నాయి.