జగ్గయ్యపేట... మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో వంట ఏజెన్సీ వారికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ (టాటా ట్రస్ట్) వారి సౌజన్యంతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ ఎల్ చిట్టిబాబు పాల్గొని ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతిరోజు కూడా ప్రభుత్వం విచ్చేటటువంటి మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజన పథకమును అమలు చేయాలని ఈ నెల 12వ తారీకు నుండి పాఠశాలలు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ముందుగానే వంట పాత్రలో శుభ్రంగా చేసుకోవాలని, గదులు శుభ్రపరచుకోవాలని ,వంట చేసేటప్పుడు సూచి శుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వడ్డించాలని తెలియజేసినారు .ఈ కార్యక్రమంలో విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శిరీష పాల్గొని తగిన సూచనలు సలహాలు ఇచ్చినారు. తదనంతరం వివిధ పాఠశాలల ఏజెన్సీ వారు శాంపిల్ గా వంట చేసుకుని వచ్చారు వాటిని లో మొదటి నుండి ఐదు బహుమతులను ఇవ్వటమైనది. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు సిఆర్పిలు మరియు వంట ఏజెన్సీ వాళ్ళు పాల్గొన్నారు.